సాహో ట్విట్టర్ రివ్యూ


అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సాహో’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే బెనిఫిట్ షోస్ పడిపోయాయ్. ట్విట్టర్ వేదికగా సినిమా టాక్ ని పంచుకొంటున్నారు. బాహుబలి సినిమాకి పూర్తిగా భిన్నంగా యాక్షన్ థ్రిల్లర్ సాహోని ఎంచుకొన్నాడు ప్రభాస్. స్టయిలీష్ టేకింగ్, ట్విస్టులు.. ఓ హాలీవుడ్ సినిమా రేంజ్ కథని ఎంచుకొన్నాడు ప్రభాస్. అందుకు తగ్గట్టుగానే సినిమాని రిచ్ గా తీసుకొచ్చారు. ట్విస్టులు అదిరిపోయాయ్. ప్రభాస్ నటనకి వంకపెట్టలేం. సినిమా రిచ్ గా ఉంది.

కానీ, ప్రేక్షకుడిని కట్టిపడేసే ఎమోషన్ కనిపించలేదు. దాంతో ప్రేక్షకుడు సాహో కథని కనెక్ట్ కాలేకపోయాడని చెబుతున్నారు. ఫస్టాఫ్ బోరింగ్ గా సాగింది. ఐతే, ఇంటర్వెల్ ట్విస్టు అదిరిపోయింది. ఇక సెకాంఢాఫ్ అసలు సిసలు సినిమా చూపిస్తారు అనుకొంటే.. వరుస ట్విస్టులు క్యూ కట్టాయి. అవి ప్రేక్షకుడిని తికమకపెట్టాయి. తప్ప ఆకట్టుకోలేదు. ఎమోషన్స్, కామెడీ లేని సాహో కథ సాదాసీదా సినిమాగా చెబుతున్నారు. ఇంటర్వెల్ ఏపీసోడ్, యాక్షన్ సీన్స్, బ్యాడ్ బోయ్స్ సాంగ్ హైలైట్ గా నిలిచాయి.

ఎమోషన్స్ మిస్ అవ్వడం, కామెడీ లేకపోవడం, సాదాసీదా కథ. క్లైమాక్స్ ఇంటర్వెల్ ట్విస్ట్ ముందు తేలిపోవడం మైనస్ లుగా చెబుతున్నారు. సినిమా రన్ టైం కూడా ఇక్కడ మైనస్ అయిందని చెబుతున్నారు. ట్విస్టులు ఎక్కువయ్యాయి. ప్రభాస్ స్టయిలీష్ యాక్షన్ కి ఎమోషన్స్ కనెక్ట్ అయితే సినిమా రేంజ్ వేరేలా ఉండేదని చెబుతున్నారు. మొత్తానికి సాహోపై మిక్సిడ్ టాక్ నడుస్తోంది.