ఇక మిగిలిన బ్యాంకులు ఇవే.. !
దేశాన్ని ఆర్థిక మందగమనం భయపెడుతోంది. వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్ఠానికి.. 5 శాతానికి చేరింది. మాంద్యం తాలూకూ ముందస్తు లక్షణాలు కళ్లముందు కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం బ్యాంకింగ్ రంగంలో మెగా విలీనాలకు తెరలేపారు. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ విలీనంతో బ్యాంకుల సంఖ్య తగ్గుతుంది. పనితీరు మెరుగుపడుతుంది. పెద్ద వ్యాపార సంస్థలకు అప్పులిచ్చే శక్తి బ్యాంకులకు పెరుగుతుంది. బహిరంగ మార్కెట్ ద్వారా నిధుల సేకరణ సులువవుతుంది. నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి. మొండి బాకీల సమస్యను అధిగమించే శక్తి పెరుగుతుంది. తాజా బ్యాంకుల విలీనంతో ఇక మిగిలేవి 12 బ్యాంకులే.
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2. పంజాబ్ నేషనల్ బ్యాంక్
3. బ్యాంక్ ఆఫ్ బరోడా
4. కెనరా బ్యాంక్
5. యూనియన్ బ్యాంక్
6. బ్యాంక్ ఆఫ్ ఇండియా
7. ఇండియన్ బ్యాంక్
8. సెంట్రల్ బ్యాంక్
9. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
10. యూకో బ్యాంక్
11. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
12. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్