బ్యాంకుల విలీనం.. జనం ఏం చేయాల్సి ఉంటుంది ?


దేశంలో ఆర్థిక మాంద్యం తాలూకూ ముందస్తు లక్షణాలు కళ్లముందు కదలాడుతున్నాయి. రాబోయే ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉద్దీపనలు ప్రకటిస్తోంది. తాజాగా బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలకు తెరతీసింది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంకుల్లోని ఖాతా దారులు ఏం చేయాల్సి ఉంటుంది అంటే.. ?

* మీ ఖాతా ఉన్న బ్యాంకు వేరే బ్యాంకులో కలిసిపోతే పాస్‌బుక్‌, చెక్‌బుక్‌ లాంటి వాటిని మార్చుకోవాలి

* వేర్వేరు లావాదేవీలకు సమర్పించిన ఖాతా వివరాల్ని మార్చాల్సి ఉంటుంది

* క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు కొత్తవి తీసుకోవాలి

* ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను సరిచూసుకోవాలి

* వడ్డీరేట్లలో మార్పు రావొచ్చు