‘చంద్రయాన్ 2’ గణపతిని చూశారా ?
వినాయక చవితి వచ్చేస్తోంది. ప్రతి యేటా కొన్ని గణనాథులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయ్. ఈ యేడాది ముంబయిలోని లాల్ బగ్చా దేవాలయంలో చంద్రయాన్ 2 గణేషుడిని సిద్ధం చేశారు. చంద్రయాన్ 2 ఉపగ్రహాం విశేషాలను తెలిపే విధంగా ఈ గణేశ్ ప్రతిమను రూపొందించారు. విగ్రహానికి ఇరువైపులా ఇద్దరు వ్యోమగాములను కృత్రిమంగా ఏర్పాటు చేశారు. తల వెనుక భాగంలో చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని ఉంచారు. బ్యాక్ గ్రౌండ్ లో ఓ తెరను ఏర్పాటు చేసి సౌర కుటుంబంలో గ్రహాల వ్యవస్థను చూపిస్తున్నారు
ఇక, కర్ణాటకలో 21 దేశాలకు చెందిన కృత్రిమ కరెన్సీతో గణేషుడు కొలువుదీరనున్నాడు. ఉడుపికి చెందిన మణిపాల్ శాండ్ హార్ట్ టీమ్‌కు చెందిన ముగ్గురు కళాకారులు.. 21 దేశాలకు చెందిన కృత్రిమ కరెన్సీతో వినాయకుడి ప్రతిమను ఏర్పాటు చేశారు. శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా, ఆప్ఘనిస్థాన్, భూటాన్, యూఏఈ, యూఎస్, ఇజ్రాయెల్‌తో పాటు పలు దేశాల కరెన్సీని ఉపయోగించారు.