రజనీ తర్వాత బన్నీనే.. !
సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘దర్భార్’ సినిమా తెరకెక్కిస్తున్నారు మురగదాస్. జెడ్ స్పీడుతో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత మురగ స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కు కథ వినిపించబోతున్నట్టు సమాచారమ్. తమిళ్ లో నేరుగా సినిమా చేయాలని బన్నీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. గతంలో లింగుస్వామి చెప్పిన కథని బన్నీ ఓకే చేశాడు కూడా. ఆ తర్వాత సినిమా క్యాన్సిల్ అయింది.
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న ‘అల వైకుంఠపురములో’ సినిమాతో పాటు సుకుమార్, వేణుశ్రీరామ్ చెప్పిన కథలకి బన్నీ ఇప్పటికే ఓకే చేసిన తెలిసిందే. అంతేకాదు.. సుకుమార్ దర్శకత్వం వహించనున్న సినిమాకి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. దసరా సందర్భంగా సినిమాని ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా తెరకెక్కనుంది. ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత మురగ-బన్నీ సినిమా ఉండనుంది. బహుశా.. వచ్చే యేడాది ఈ సినిమా పట్టాలెక్కవచ్చు.