రామ్ ఈ కన్ఫూజన్ ఏంటీ.. ?

గతంలో ‘నేను శైలజ’తో హిట్ కొట్టాడు రామ్. ఇందులో రామ్ కొత్తగా కనిపించాడు. తన ఎనర్జిని అంతా పక్కనపెట్టేసి సెటిల్డ్ గా నటించాడు. అది ప్రేక్షకులకి బాగా నచ్చేసింది. ఇక రామ్ మారాడు. ఇకపై ఆయన్నుంచి విభిన్నమైన సినిమాలు వస్తాయని అభిమానులు ఆశపడ్డారు. కానీ ‘హైపర్’తో తాను ఏమాత్రం మారలేదని నిరూపించాడు రామ్. ఫలితంగా మళ్లీ ప్లాపుల్లోకి వెళ్లిపోయాడు.

ఇక ‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నాడు రామ్. ఐతే, ఈ సినిమా తర్వాత రామ్ గందరగోళానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. వెంటనే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ చేయాలనే ఆలోచనలో రామ్ ఉన్నాడు. కానీ ఇప్పటికిప్పుడు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ఐడియా పూరి వద్దలేదు. ఇదీగాక పూరి చాలా ఫాస్ట్ గా తన తదుపరి సినిమాని లైన్ లో పెట్టేశాడు. విజయ్ దేవరకొండతో పూరి సినిమా త్వరలోనే మొదలవ్వనుంది. ఈ నేపథ్యంలో రామ్ మళ్లీ మాస్ సినిమాని ఎంచుకోవాలా, లేదా తనకి అచ్చొచ్చిన లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఎంచుకోవాలా ? అనే కన్ఫూజన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.