బిగ్ బాస్ 3 : నాగార్జున స్థానంలో రమ్యకృష్ణ


కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 3 ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. విజయవంతంగా ఐదువారాలని పూర్తి చేసుకొంది. శని, ఆదివారాలు నాగ్ తనదైన శైలిలో షోని రక్తికట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే, ఈవారం నాగార్జున స్థానంలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించబోతున్నారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నాగార్జున ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు.

ఈ నేపథ్యంలో వ్యాఖ్యాతగా వ్యవహరించాల్సిందిగా బిగ్ బాస్ టీం రమ్యకృష్ణను కోరింది. దీనికి ఆమె కూడా ఒప్పుకొన్నారు. శనివారం ప్రసారమయ్యే షోకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా అభిమానులతో పంచుకుంది. ఎంట్రీ సీన్ లో శివగామి బాహుబలి డైలాగ్ తో అదరగొట్టేసింది. ఈ వారం రమ్యకృష్ణ ఎలా అలరిస్తారన్నది చూడాలి.

ఇక, బిగ్ బాస్ ఇంటి నుంచి తొలివారం హేమ, రెండోవారం జాఫర్, మూడోవారం తమన్నా, నాల్గోవారం రోహిణి, ఐదోవారం ఆషూరెడ్డి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ యేడాది ఇంటినుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.