‘సాహో’ ఫస్ట్ డే కలెక్షన్స్

‘బాహుబలి’ని టచ్ చేస్తుంది అనుకొన్న ‘సాహో’ షాకిచ్చింది. ఇకపై నాన్ బాహుబలి పదం వినబడదు అనుకొంటే సాహో ప్లాప్ టాక్ వినాల్సి వచ్చింది. అయినా.. ప్రభాస్ స్టార్ డమ్, అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా సాహోకి తొలిరోజు మంచి కలెక్షన్స్ నే దక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో సాహో తొలిరోజు రూ. రూ.36.39 కోట్ల షేర్ ని రాబట్టింది. బాలీవుడ్ లో రూ. 24కోట్ల షేర్ ని తీసుకొచ్చింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో సాహో కలెక్షన్స్ ఏరియాలవారీగా చూస్తే.. నైజాం రూ.9.40 కోట్లు, సీడెడ్ రూ.4.7 కోట్లు, కృష్ణా రూ.2.51 కోట్లు,
వెస్ట్ రూ.3.6 కోట్లు, ఈస్ట్ రూ.4.42 కోట్లు, గుంటూరు రూ.4.69 కోట్లు, నెల్లూరు రూ.2.5 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.3.77 కోట్లు వసూలు చేసింది. రెండు చోట్ల నైజాం, నెల్లూరులో సాహో బాహుబలి 2 తొలిరోజు కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేయడం విశేషం.