‘పీవీ సింధు’గా సమంత ?


ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచిన పీవీ సింధు పేరు మారుమ్రోగిపోతుంది. మరోవైపు, ఆమె జీవితకథని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారమ్. తెలుగు ప్రేక్షకులకి బాగా తెలిసిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ పీవీ సింధు కథని రెడీ చేయిస్తున్నాడట. ఈ బయోపిక్ ని సొంతంగా నిర్మిస్తూనే.. ఇందులో కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక టైటిల్ రోల్ కోసం సమంతని తీసుకొన్నట్టు సమాచారమ్.

వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న స‌మంత అయితేనే పీవీ సింధు పాత్ర‌కి స‌రిగ్గా స‌రిపోతుంద‌ని సోనూసూద్ భావించాడ‌ట‌. పీవీ సింధు బయోపిక్ పై మరింత క్లారిటీ రావాల్సివుంది. ప్రస్తుతం సమంత అమెజాన్ వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నారు. అదికాక శర్వానంద్ సరసన ’96’ సినిమా రీమేక్ చేస్తున్నారు. ఈ రెండింటిని పూర్తి చేసి సామ్ సింధుగా మారానుంది. ప్రస్తుతానికి ఈ సినిమా స్క్రిప్ట్ దశలో వుందని, ప్రాధమిక చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది.