బుమ్రా హ్యాట్రిక్


విండీస్ తో రెండో టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. టెస్టులో విహారి (111; 225బంతుల్లో 16*4) సెంచరీ సాధించాడు. ఐతే, అనూహ్యంగా ఇషాంత్ శర్మ (57, 80బంతులో 7*4) క్రీజులో పాతుకుపోయాడు.కోహ్లీ సేన 416 పరుగుల వద్ద ఆలౌటైంది. హోల్డర్ ఐదు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం బ్యాటింగ్ కి దిగిన విండీస్ ని పేస్ బౌలర్ బుమ్రా(6/16) హ్యాట్రిక్ తో చెలరేగి పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశాడు. అతని ధాటికి రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 33 ఓవర్లకి 7 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. ఇక, టెస్టు క్రికెట్ లో భారత్ తరఫున ఇది మూడో హ్యాట్రిక్ రికార్డు. ముందుగా 2001లో వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియాపై తొలిసారిగా హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఐదేళ్ల (2006) తర్వాత ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ దాయాది పాకిస్థాన్ పై హ్యాట్రిక్ అందుకున్న రెండో బౌలర్ గా నిలిచాడు. తాజాగా బుమ్రా ఈ ఘనత అందుకొని వారి సరసన చేరాడు.