బొత్స కాబోయే సీఎం ! పవన్ మైండ్ గేమ్ ?
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఫక్తు రాజకీయ నాయకుడిగా మారినట్టు అనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభావం పెద్దగా కనిపించలేదు. కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలుపొందింది. అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమిపాలయ్యారు. ఐతే, ఓటమితో పవన్ కుంగిపోలేదు. ప్రజల తరుపున జనసేన పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ఆ దిశగా పార్టీని బలపేతం చేసే చర్యలని ప్రారంభించాడు. మరోవైపు పొలిటికల్ మైండ్ గేమ్ మొదలెట్టాడు పవన్.
ఇందులో భాగంగా ముందుగా మెగా అభిమానులని ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందులో విజయవంతం అయ్యారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. మెగా అభిమానులని ఖుషి చేశాడు. ఇక, రాజధాని మార్పు వ్యవహారంలో రైతులకి భరోసా ఇచ్చాడు. రాజధాని తరలించకుండా చూడటం నా బాధ్యత అన్నారు. అదే సమయంలో రాజధానిపై సంచనల వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి బొత్స కాబోయే సీఎం అంటూ.. కామెంట్ చేశాడు. తద్వారా వైకాపాలో గందరగోళం సృష్టించడం తో పాటు.. కాపు నేతలని ఆకర్షించడం పవన్ లక్ష్యం కావొచ్చన్నది విశ్లేషకుల మాట.