పవన్ పుట్టినరోజున.. నాగబాబు కమర్షియల్ మాటలు !


తమ్ముడు పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నాగబాబు. పుట్టినరోజు వేడుకలని ఘనంగా చేసుకోవడం తమ్ముడికి ఇష్టం ఉండదని అన్నారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా నాగబాబు ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో జనసైనికుల గురించి గొప్పగా మాట్లాడారు. జనసేన పార్టీ కోసం జనసైనికులు రూ. 100కోట్ల విరాళాలు సేకరించాలని సంకల్పించడం సంతోషానిచ్చింది. రూ.100 కోట్ల విరాళాలు సేకరించాలనే లక్ష్యం చేరుకొంటారా ? లేదా ? అన్న విషయం పక్కనపెడితే.. మీ సంకల్పం చాలా గొప్పది. మీ అభిమానం చూస్తుంటే, జనసేన క్యాడర్ చాలా బలంగా ఉందని అర్థమవుతోందన్నారు.

ఇక ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలుపొందింది. అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు. అయినా.. పవన్ వెన్నుచూపలేదు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ఆ దిశగా పార్టీ శ్రేణులని సన్నద్ధం చేస్తున్నారు. రాజధాని తరలింపు వ్యవహారంలో ప్రజలు కూడా పవన్ పైనే భరోసా ఉంచారు. ఆయన మాత్రం రాజధాని అమరావతి నుంచి తరలిపోకుండా ఆపగలరని రాజధాని రైతులు గట్టిగా నమ్ముతున్నారు. పవన్ కూడా రాజధాని తరలింపు జరగదని, అది తన బాధ్యతని అని భరోసా ఇచ్చారు.