సైరా తొలిదెబ్బ.. బాహుబలి, సాహో రికార్డ్స్ బ్రేక్ !

నాన్ బాహుబలి పదాన్ని చెరిపేస్తోందని భావించిన ‘సాహో’ నిరాశపరిచింది. గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్ ‘సాహో’ మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకొంది. ఐతే, ప్రభాస్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా తొలిరోజు, వీకెండ్ కలెక్షన్స్ బాగానే దక్కాయి. నైజాం, నెల్లూరు ఏరియాల్లో తొలిరోజు బాహుబలి రికార్డులని బ్రేక్ చేసింది సాహో. అయితే సాహో నుంచి ఆశించింది అది కాదు. హాలీవుడ్ రేంజ్ సినిమా అనిపించుకుంటోంది. బాహుబలి రేంజ్ హిట్ అవుతుందని ఆశించారు. కానీ, ఆశలు అడియాశలు అయ్యాయి.

ఇక ఇప్పుడు ఆశలు, అంచనాలన్నీ మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’పైనే. తొలితరం స్వాత్రంత్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటించారు. విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రనికి సురేంధర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ నిర్మించారు.

సైరా ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరుగుతున్నట్టు సమాచారమ్. ఉభయగోదావరి జిల్లాలో ఈ సినిమా హక్కులు ఏకంగా రూ. 19.6కోట్లకి అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. ఇక్కడ బాహుబలి, సాహో హక్కులు కూడా ఇంత రేటు పలకలేదు. ఇది చిత్రబృందానికి బూస్ట్ నిచ్చే విషయమని చెప్పవచ్చు. ఐతే, ఈ వార్తల్లో నిజమెంత ? అనేది చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది.