విజయ్’ని తొక్కేశారు.. నిజమే !


టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండనే ఇండస్ట్రీలో తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ‘డియర్ కామ్రేడ్’ ఫలితంపై విజయ్ అసహనం వ్యక్తం చేయడం చూశాం. ఈ సినిమాని కావాలని అణగదొక్కారని అన్నారు. తాజాగా విజయ్ మాటలకి మరింత బలం చేకూరుతోంది. ఇటీవలే ‘డియర్ కామ్రేడ్’ అమెజాన్ ప్రైమ్ వీడియాలో అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ ఫ్లాట్ ఫాంపై మంచి స్పందన దక్కించుకుంటోంది. సినిమా చాలా బాగుందని కితాబిస్తున్నారు.

ఇలాంటి సినిమాని థియేటర్ లో చూడకపోవడం అసంతృప్తినిచ్చిందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో డియర్ కామ్రేడ్ ని అణగదొక్కారని విజయ్ చేసిన కామెంట్స్ ని బలం చేకూరినట్టయింది. ఈ సినిమా కోసం విజయ్ బాగా కష్టపడ్డాడు. సినిమాని నాలుగు బాషల్లో ప్లాన్ చేశాడు. దక్షణాదిన ప్రధాన నగరాలన్నీ తిరిగి సినిమాని ప్రమోట్ చేశారు. కానీ సినిమా ఫలితం విజయ్ ని నిరూత్సాహపరిచిందని చెప్పాలి. ఇక, విజయ్ తదుపరి సినిమా క్రాంతి మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఆ తర్వాత పూరి దర్శకత్వంలో విజయ్ సినిమా ప్రారంభం కానుంది.