విండీస్ కు మరో గుండు’సున్నా’ !
వెస్టిండీస్ టూర్ లో టీమిండియా లక్ష్యం పరిపూర్ణం అయింది. టీ20, వన్డే సిరీస్ లని క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీ సేన రెండు టెస్టుల సిరీస్ లోనూ భారత్ క్లీన్ స్వీప్ చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. హనుమ విహారి సెంచరీ, మయాంక్ అగర్వాల్, కోహ్లీ, ఇషాంత్ శర్మలు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకొన్నారు. ఇక తొలి ఇన్నింగ్స్ లో విండీస్ బుమ్రా ధాటికి కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఫాలో ఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. విండీస్ ఎదుట కొండంత విజయలక్ష్యం ఉంచింది. ఐతే విండీస్ రెండో ఇన్నింగ్స్ లో 210 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో టెస్ట్ లో భారత్ 257 పరుగులు భారీ ఆధిక్యతతో విజయం సాధించింది. ఇక కెప్టెన్ గా కోహ్లీ ధోని పేరిట ఉన్న రికార్డుని బద్దలు కొట్టాడు. కెప్టెన్ గా ధోనీ 60 టెస్టులలో 27 విజయాలు సాధించాడు. ఇప్పుడీ రికార్డుని కోహ్లీ 48 టెస్టుల్లో 27 టెస్టులను గెలిచి రికార్డ్ సృష్టించాడు.