మనోజ్ చక్కని ఫోటో.. మంచి కామెంట్స్ !
హీరో మంచు మనోజ్ చక్కని ఫోటోని అభిమానులతో పంచుకొన్నారు. తల్లిదండ్రులతో కలిసి దిగిన లెటెస్ట్ పిక్ అది. ఆ ఫోటోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన మనోజ్.. ‘వీళ్లు నా తల్లిదండ్రులు మాత్రమే కాదు. గురువు, దైవాలు కూడా. అమ్మ-నాన్న నా ప్రపంచం” అంటూ కామెంట్ పెట్టారు. ఇందులో మనోజ్ సన్నబడి కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.
మంచు మనోజ్ కొత్త సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. రెండేళ్ల గ్యాప్ తర్వాత మనోజ్ చేస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు శ్రీకాంత్ దర్శకత్వం వహించనున్నారు. శ్రీకాంత్ కు షార్ట్ ఫిల్మ్ చేసిన అనుభవం ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడందుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Veellu naa thalli thandri matrame kadu… Guruvu daivalu kuda 😍😍😍
My amma nanna… My world ❤🙏#ParentsLove #family #familytime pic.twitter.com/H7CSlZw2ND— MM*🙏🏻❤️ (@HeroManoj1) September 3, 2019