పవన్ ని ‘పావాలా’ అంటే పూనమ్ హ్యాపీనా ?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో లింకుపెడుతూ హీరోయిన్ పూనమ్ కౌర్ పై బోలేడు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆమెని అడ్డుపెట్టుకొని పవన్ ని రాజకీయంగా దెబ్బ తీయాలనే ప్రయత్నాలు జరిగినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడిచింది. ఐతే, పూనమ్ కూడా పవన్ తో ఫ్రీ పబ్లిసిటీ పొందేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు అనిపిస్తోంది.

సోమవారం పవన్ కల్యాణ్ బర్త్ డే కానుకగా.. ఆయనకి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, జనసైకుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తాయి. ‘కొమరం పులి’ హీరోయిన్ నికిషా పటేల్ కూడా పవన్ ని ట్విట్టర్ వేదికగా పవన్ ని విష్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ‘పావాలా’ అనే హ్యాష్ ట్యాగ్ ని ఇచ్చింది. దాంతో నికీషాపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో తప్పు తెలుసుకొన్న నికీషా.. సరిచేసుకొంది. అదేసమయంలో పవన్ అభిమానులకి క్షమాణలు చెప్పింది. అంతటితో వివాదం సద్దుమణిగినట్టయింది.

ఐతే, దానికి కొనసాగింపు అన్నట్టుగా, పిలవని పేరంటానికి వచ్చిన అతిథిలా పూనమ్ సీన్ లోకి వచ్చింది. ఈ వ్యవహారంలో నికీషా పటేల్ కి ఉచిత సలహాలు కూడా ఇచ్చింది. పవన్ ని ‘పావాలా’ అంటే ఎంజాయ్ చేసినట్టుగా ఉంది పూనమ్ వ్యవహార శైలి. పవన్ ఫ్యాన్స్ ని పటించుకోవాల్సిన పనిలేదన్నట్టుగా నికీషాకి సలహాలు, సూచనలు చేసింది. ఇంతకీ పూనమ్ ఏమన్నది అంటే.. ?

“నికిషా.. నువ్వు ప్రజలకు జవాబుదారీవి కావు. కాబట్టి వివరణలు ఇవ్వడం మానేయ్. లేదంటే నిన్ను ట్రోల్ చేస్తూనే ఉంటారు. గతంలో నువ్వు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నీ వ్యాఖ్యలను వక్రీకరించిన ఆ చెత్త జర్నలిస్ట్ గుర్తున్నాడు కదా. దానివల్ల నీ కెరీర్ పైనే ప్రభావం పడింది. ప్రశాంతంగా ఎంజాయ్ చేయ్. నువ్వు నిజం కోసమే నిలబడతావ్. ఐ లవ్ యూ. నీకు దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా” అంటూ పూనమ్ ట్విట్ చేసింది.