బాలీవుడ్ ‘జెర్సీ’లో రస్మిక ?


ఈ యేడాది వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. ఇందులో నాని క్రికెట్ గా కనిపించారు. ఆయన ప్రేయసి, భార్యగా శ్రద్దా శ్రీనాథ్ నటించారు. ఈ చిత్రానికి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించింది. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జెర్సీ’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడీ సినిమా బాలీవుడ్ కి వెళ్లనుంది.

అర్జున్ రెడ్డి రిమేక్ కబీర్ సింగ్ తో హిట్ కొట్టిన షాహిద్ కపూర్ కథానాయకుడిగా బాలీవుడ్ ‘జెర్సీ’ తెరకెక్కనుంది. ఈ రిమేక్ కోసం హీరోయిన్ గా ముందుగా మాతృక హీరోయిన్ శ్రద్దా కపూర్ పేరు వినిపించింది. ఐతే, ఫైనల్ గా రష్మిక మందన పేరు ఖరారైనట్టు సమాచారమ్. ఈ విషయాన్నే రస్మిక అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నటిస్తోంది రస్మిక. తెలుగులో బిజీగా ఉండగానే రస్మిక బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నట్టు అర్థమవుతోంది.

బాలీవుడ్ ‘జెర్సీ’కి దర్శకుడు ఎవరు ? పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.