‘సాహో’ బ్లాక్ బస్టర్ హిట్.. ఎలా కాదనగలరు ?

‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ నుంచి వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కూడా ఇదే. అంతేకాదు.. సాహో బాహుబలి రేంజ్ హిట్ అవుతుందని ఆశించారు. టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోలు చూస్తే అలానే అనిపించింది. కానీ అంచనాలని అందుకునేలా సాహో లేదనే టాక్ వచ్చేసింది. ఐతే, టాక్ తో సంబంధం లేకుండా సాహో మంచి కలెక్షన్స్ రాబడుతుండటం విశేషం. ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 294కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.

శుక్రవారం ప్రీమియర్ షోస్, అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా సాహో భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఒకట్రెండు చోట్ల బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొట్టింది కూడా. వీకెండ్ కావడంతో శని, ఆదివారాలు మంచి కలెక్షన్స్ దక్కాయి. ఇక సోమవారం వినాయకచవితి సెలవు బాగా కలిసొచ్చింది. మంగళవారం నుంచి సాహో కలెక్షన్స్ భారీగా తగ్గవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దాదాపు రూ. 350కోట్ల బడ్జెటో సాహో తెరకెక్కింది. ఐతే, మూడ్రోజుల కలెక్షన్స్ రూ. 294కోట్ల గ్రాస్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో సాహో కమర్షియల్ హిట్ అనే చెప్పాలి. ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా.. సాహో టాక్ తో సంబంధం లేకుండా కాసులు కురిపిస్తోంది.

సుజీత్ దర్శకత్వంలో సాహో తెరకెక్కింది. ఇందులో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించింది. ఓ ప్రత్యేక గీతంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మెరిసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ దాదాపు రూ. 350కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది.