బిగ్ బాస్ 3 : రెండో వైల్డ్ కార్డ్.. శిల్పా చక్రవర్తి ఎంట్రీ

బిగ్ బాస్ 3 విజయవంతంగా ఆరువారాలని పూర్తి చేసుకొంది. ఏడోవారంలోకి ఎంటర్ అయింది. ఈ నేపథ్యంలో ఎంటర్ టైన్ మెంట్ డోస్ పెంచాలనే ఆలోచనలో రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీని ప్లాన్ చేసింది బిగ్ బాస్ యాజమాన్యం. రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా శిల్పా చక్రవర్తిని హౌస్ లోకి పంపారు. అంతకంటే ముందు శిల్పా చక్రవర్తితోనే ఈవారం నామినేట్ ప్రక్రియని నిర్వహించారు.

చీకటిలో ఉన్న శిల్పా ఇంటిసభ్యులందర్నీ ఇంటర్వ్యూ చేస్తూ.. నామినేషన్‌ ప్రక్రియని పూర్తి చేసింది. ఇంటి సభ్యుల మనస్తత్వం ఏంటీ ? వారికి ఎవరంటే నచ్చదు.. ఇలా ప్రతీ విషయం శిల్పాకు తెలుసుకొంది. నామినేషన్‌ ప్రక్రియ పూర్తైన వెంటనే.. శిల్పా లివింగ్‌ ఏరియాలో ఉన్న హౌస్‌మేట్స్‌ కి సర్ప్రైజ్ ఇస్తూ ఇంట్లోకి ప్రవేశించింది. తన వంతుగా ఇద్దరి సభ్యులని నామినేట్ చేసింది. ఇంతవరకు నామినేషన్‌ ఫేస్‌ చేయలేదని అలీని, స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అని శ్రీముఖిని నామినేట్‌ చేసింది. ఏడోవారం రాహుల్, మహేష్ విట్టా, రవి, అలీ, శ్రీముఖి ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.