వైరల్ : గణేషుడు ముందే బీర్లు పొంగించిండ్రు.. !


దేశ వ్యాప్తంగా వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. భారీ వినాయక విగ్రాహాలు, వివిధ రూపాల్లో తయారు చేసిన వినాయక విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఐతే, కొన్ని చోట్ల వినాయక ఉత్సవాల్లో అసాంఘిక పనులు చోటు చేసుకోవడం విచారకరం.

సూరత్ లో గణనాథుని ఊరిగింపుగా తీసుకొస్తున్న సమయంలోనే యువకులు బీర్ల తాగుతూ.. డ్యాన్స్ చేస్తూ హంగామా చేశారు. దానికి సంబంధించిన వీడియోని పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువకుల తీరుపై మండిపడుతున్నారు.