‘వాల్మీకి’ సెట్ లో సుకుమార్.. ఏంటీ సంగతి ?


క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ వాల్మీకి చిత్రబృందాన్ని సప్రైజ్ చేశాడు. సడెన్ గా వాల్మీకి సెట్ లో ప్రత్యక్షమయ్యారట. ఈ సందర్భంగా తీసుకొన్న ఫోటోలని దర్శకుడు హరీష్ శంకర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. “సుకుమార్ చిన్ని సప్రైజ్ ఇచ్చారు. వాల్మీకి సెట్స్ కి వచ్చారు. థ్యాంకు డార్లింగ్ సుక్కు” అంటూ కామెంట్స్ పెట్టాడు హరీష్.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడుగా వాల్మీకి తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు తెలుగు రీమేక్‌ ఇది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నాడు. కోలీవుడ్ కుర్ర హీరో అథర్వ ముఖ్య పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ‘రంగస్థలం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నాడు దర్శకుడు సుకుమార్. కానీ ఇంతవరకు తన తదుపరి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. సుక్కు తదుపరి సినిమా స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తో ఉండనుంది. దానికి ఇంకాస్త టైం పట్టనుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ‘అల.. వైకుంఠపురంలో’ తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత బన్నీ-సుక్కు సినిమా ఉండనుంది.