‘డిస్కో రాజా’ కోసం థమన్ కష్టం చూశారా ?

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడంలో స్పెషలిస్ట్ అనిపించుకొన్నాడు ఎస్ ఎస్ థమన్. తొలిప్రేమ, అరవింద సమేత.. సినిమాలకి అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. వి. ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ‘డిస్కో రాజా’. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనుల్లో ఉన్నారు.

ఈ విషయాన్ని తెలుపుతూ థమన్ వరుస ట్విట్ చేశారు. డిస్కోరాజా కోసం సీనియర్ మెజీషియన్స్ తో పని చేస్తున్నాం. తాను 11యేళ్ల నుంచి వారి వద్ద డ్రమ్స్ వాయించాను. ఇప్పుడు వారందరినీ డిస్కోరాజా కోసం పిలిపించినట్టు తెలిపారు. ఇక, చెన్నైలో స్ట్రింగ్ సెక్షన్ కి సంబంధించిన వీడియోని థమన్ తన ఇన్ స్ట్రోగ్రామ్ లో షేర్ చేశారు.