వివేకా హత్యకేసు నిందితుడు ఆత్మహత్య
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకి ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. మార్చి 14న వివేక హత్య జరిగింది. ఈ హత్య కేసును దర్యాప్తు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న గంగిరెడ్డి, రంగయ్య, పరమేశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఈ కేసులో నార్కో అనాలిసిస్ టెస్టులకు కూడ పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో అనుమానితుడుగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఐతే, ఆత్మహత్యకు ముందే శ్రీనివాసులు రెడ్డి సీఎం జగన్, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు లేఖలు రాసినట్టుగా సమాచారమ్. పోలీసులు తనను తన కుటుంబాన్ని వేధిస్తున్నారని, పులివెందుల సీఐ శ్రీరాములు వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడినట్టుగా శ్రీనివాసులు రెడ్డి తన సుసైడ్ నోటులో పేర్కొన్నారు.