టాలీవుడ్ లో ‘చీప్ స్టార్’ ఎవరు ?

యువ దర్శకుడు అజయ్ భూపతికి ఓ హీరోపై బాగా కాలింది. ఆయన ‘చీప్ స్టార్’ అంటూ ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు. దీంతో టాలీవుడ్ లో ఆ చీప్ స్టార్ ఎవరు ? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ‘ఆర్ఎక్స్100’ సినిమాతో ప్రతిభ ఉన్న దర్శకుడు అనిపించుకొన్నాడు అజయ్ భూపతి. ఆయన రెండో సినిమా కోసం ‘మహాసముద్రం’ కథని రెడీ చేసుకొన్నాడు. ఈ కథతో చాలామంది హీరోల చుట్టూ తిరిగాడు. ఫైనల్ గా మాస్ మహారాజా రవితేజ దగ్గర ‘మహాసముద్రం’ కథ ఆగింది.

ఐతే సడెన్ గా అజయ్ భూపతి ‘చీప్ స్టార్’ అని ట్విట్ చేయడంతో.. అది రవితేజనే అనే ప్రచారం జరుగుతోంది. మహాసముద్రం కథని రవితేజ మెచ్చాడు. కానీ కొన్ని కరెక్షన్స్ చేయమని సూచించినట్టు సమాచారమ్. మరోవైపు రవితేజతోనూ మహాసముద్రం సినిమా క్యాన్సిల్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రవితేజపై తన ప్రస్టేషన్ ని అజయ్ భూపతి చూపించి ఉంటాడని చెప్పుకొంటున్నారు. ఇక, మహాసముద్రం కథని సమంత వినేసింది. ఆమెకు బాగా నచ్చేసినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ కథని నాగ చైతన్య దగ్గరికి తీసుకెళ్లి.. ఆయన్ని ఒప్పించి.. చైతూ-సమంత జోడీగా మహాసముద్రం సినిమా తీసుకురావాలనే ప్రయత్నాలు అజయ్ భూపతి చేస్తున్నట్టు సమాచారమ్. ఈ విషయం పక్కన పెడితే ‘చీప్ స్టార్’ ఎవరనేది ఇప్పటికిప్పుడు కాకపోయినా.. భవిష్యత్ లోనైనా అజయ్ భూపతి క్లారిటీ ఇవ్వక తప్పదేమో.. !