శ్రీదేవి మైనపు విగ్రహాన్ని చూశారా ?
సింగపూర్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి మైనపు విగ్రహం కొలువుదీరింది. బుధవారం జరిగిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్ లు పాల్గొన్నారు. అతిలోక సుందరి నిజంగానే దిగివచ్చిందా అన్నట్లుగా మ్యూజియం సిబ్బంది విగ్రహాన్ని రూపొందించారు.
1987లో శ్రీదేవి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘మిస్టర్ ఇండియా’లోని హవా హవాయి లుక్ ఆధారంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
బంగారు వర్ణపు వస్త్రాలు ధరించి, తలపై కిరీటంతో ఈ మైనపు బొమ్మ చూపరులను ఆకట్టుకుంటోంది. కాగా, శ్రీదేవి గత సంవత్సరం ఫిబ్రవరి 24న దుబాయ్ లోని ఓ కార్యక్రమానికి వెళ్లి అక్కడ హోటల్ గదిలో ప్రమాదవశాత్తు బాత్ టబ్ లోపడి మృతిచెందిన విషయం తెలిసిందే.
I could practically hear the heartbreak in #boneykapoor ‘s voice. Such tremendous love he had for #Sridevi ❤️🌸 pic.twitter.com/5lnXrTvUj4
— 𓃠 (@allthatisshals) September 4, 2019