సోనమ్.. చూపులు తిప్పుకోలేం !

ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ పై చూపులు తిప్పుకోలేకపోతున్నారు జనాలు. ఆమె తాజా ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో సోనమ్ రెడ్ కలర్ డిజైనర్ వేర్ లో మెరిసిపోతుంది. టాప్ ను చూస్తే ఒక లేడీస్ టాప్ లా ఎంబ్రాయిడరీ డిజైన్ లో ఉంది. కానీ అదేమో ఒక బ్లేజర్ మోడల్. టాప్ ఇలా ఉంటే దీనికి మ్యాచింగ్ బాటమ్ ఒక లెహెంగా. డ్రెస్ లోనే ఇంత ఫ్యాషన్ రంగరించిన సోనమ్ వీలైనంత డీప్ వీ నెక్ తో అందాలను ఆరబోసింది.

ఈ ఫోటోలని సోనమ్ తన ఇన్ స్ట్రోగ్రామ్ లో షేర్ చేసింది. ఎలాంటి క్యాప్షన్ పెట్టకుండా చూసి ఎంజాయ్ చేయండి.. అన్నట్టుగా ఫోటోలు పోస్ట్ చేసింది. ఇప్పుడీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే రెండు లక్షల లైక్స్ వచ్చాయి. “స్టన్నింగ్ కె. అహూజా”.. “రెడ్ హాట్ బ్యూటీ”.. “సూపర్ హాట్”.. “సెక్సియస్ట్ ఫ్యాషనిస్టా” అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు నెటిజన్స్.