వివాదం : వాల్మీకి చేతిలో గన్ ఏంటీ ?


హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా యంగ్ హీరో వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ సినిమా టైటిల్ విషయంలో మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. టైటిల్ ని మార్చాల్సిందేనని వాల్మీకి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐతే, వాటిని పట్టించుకోకుండా చిత్రబృందం ముందుకెళ్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసింది. ఈ నెల 20న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో వాల్మీకి కులస్థులు ఎక్కువగా ఉండే కర్నూలు జిల్లాలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. బుధవారం వాల్మీకి సంఘాలు నిరసకి దిగాయి. వాల్మీకి చేతిలో గన్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. టైటిల్ ని మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కావాలంటే.. వాల్మీకి టైటిల్ ని పెట్టి.. వాల్మీకి బయోపిక్ ని తెరకెక్కిస్తే హర్షిస్తామని అన్నారు. రామాయాణాన్ని రచించిన వ్యక్తి వాల్మీకి. అలాంటి వ్యక్తి పేరు పెట్టి చేతిలో గన్ పెట్టి సినిమా తీస్తే బాగుండని.. వాల్మీకి టైటిల్ ని తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు.