మళ్లీ స్మిత్ నే అడ్డు

యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు అంతా ఒకవైపు, ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ స్మిత్ ఒకవైపులా తయారైంది. స్టివ్ తన అద్భుతమైన బ్యాంటింగ్ తో ఇంగ్లాండ్ ని ఓటమిపాలు చేస్తున్నాడు. తొలి రెండు టెస్టుల్లో అద్భుతంగా రాణించిన అతను.. నాలుగో టెస్టులోనూ తనదైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు బుధవారం ఆరంభమైన ఆరంభమైన మ్యాచ్ లో ఇంగ్లిష్ బౌలర్లకు అడ్డు నిలిచాడు.

సువర్ట్ బ్రాడ్ (2/35) ధాటికి ఆసీస్ ఓపెనర్లు వార్నర్ (0), హ్యారిస్ (13) ఆరంభంలోనే వెనుదిరగడంతో ఆసీస్ 28/2తో కష్టాల్లో పడింది. ఈ స్థితిలో లబుషేన్ (67; 128 బంతుల్లో) సహకారంతో స్మిత్ (60 బ్యాటింగ్, 93 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలిరోజు ఆసీస్ 170/3గా నిలిచింది. వర్షం వల్ల తొలి రోజు 44 ఓవర్లే సాధ్యపడింది.