హ్యాట్రిక్ కాంబో.. హ్యాట్రిక్ హిట్స్ దక్కేనా ?

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా రెండు హ్యాట్రిక్ కాంబోలో సినిమాలు చేస్తున్నారు. త్రివిక్రమ్-బన్నీలది హిట్ కాంబో. వీరి కలయికలో వచ్చిన జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి మంచి విజయాలు అందుకొన్నాయి. తాజా కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రం అల.. వైకుంఠపురంలో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. హిట్ ఖాయమని మెగా అభిమానులు చెప్పుకొంటున్నారు.

ఇక, ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉండనుంది. ఇది కూడా హ్యాట్రిక్ కాంబోనే. సుక్కు-బన్నీ కలయికలో వచ్చిన ఆర్య, ఆర్య2 సూపర్ హిట్ అయ్యాయి. ఇదీగాక బన్నీలోని అసలు టాలెంట్ ని వెలికి తీసిన సినిమా ‘ఆర్య’ నే. వీరి కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రం వచ్చే యేడాది 3న ప్రారంభం కాబోతున్నట్టు సమాచారమ్. ఈ నేపథ్యంలో బన్నీ హ్యాట్రిక్ కాంబోలో రెండు చిత్రాలు హిట్స్ అవుతాయేమో చూడాలి.