రివ్యూ : జోడి

చిత్రం : జోడి (2019)

నటీనటులు : ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్, వెన్నెల కిషోర్ తదితరులు

సంగీతం : ఫణి కల్యాణ్

దర్శకత్వం : విశ్వనాథ్ అరిగెల

నిర్మాతలు : సాయి వెంకటేష్ గుర్రం, పద్మజ

రిలీజ్ డేట్ : 06సెప్టెంబర్, 2019.

కన్నడ ‘యూటర్న్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా శ్రీనాథ్. ఆమె నటించిన తొలి తెలుగు సినిమా ‘జెర్సీ’. ఇందులో నాని ప్రియురాలు, భార్యగా గొప్పగా నటించింది. ఇక కెరీర్ తొలినాళ్లలో ఒకట్రెండు విజయాలు అందుకొన్న హీరో ఆది సాయి కుమార్. ఈ మధ్య ఆయన్ని వరుస ప్లాపులు పలకరిస్తున్నారు. వీరిద్దరు జంటగా నటించిన చిత్రం ‘జోడి’. ఈ చిత్రానికి విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన జోడీ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. ఈ జోడీ ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంది ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

ఆది.. ఓ స్టార్ వేర్ ఉద్యోగి. ఆది తండ్రి నరేష్ మాత్రం బేవర్స్. క్రికెట్ పిచ్చోడు.. ఆ మోజుతో క్రికెట్ బెట్టింగులు కాస్తూ.. కొడుకు సంపాదనని ఖర్చు చేస్తుంటాడు. ఇక ఆది తొలి చూపులోనే శ్రద్దా శ్రీనాథ్ తో ప్రేమలో పడతాడు. ఆమెని ఒప్పిస్తాడు. శ్రద్దా తండ్రి కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఐతే, ఆది తండ్రి నరేష్ ని చూసిన తర్వాత పెళ్లికి నో చెబుతాడు శ్రద్దా తండ్రి. మరీ.. ఫైనల్ గా ఆది-శ్రద్దాల పెళ్లి జరిగిందా ? అన్నది కాస్త కామెడీ టచ్ తో కూడిన ఎమోషనల్ కథ.

ప్లస్ పాయింట్స్ :

* శ్రద్దా శ్రీనాథ్ నటన

* కొన్ని కామెడీ సీన్స్

* కొన్ని ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

* కథ-కథనం

* స్లో నేరేషన్

* ముందే ఊహించే సన్నివేశాలు

బ్లాక్ బస్టర్ టైటిల్ ‘జోడి’. ప్రశాంత్-ఐశ్వర్య రాయ్ జంటగా నటించిన ‘జోడి’ సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ‘జోడి’ సాంగ్స్ ఇప్పటికీ ఫంక్షన్స్, పార్టీలలో మారుమ్రోగుతుంటాయ్. ఐతే, ఆది-శ్రద్దా శ్రీనాథ్ ల ‘జోడీ’ ఆ రేంజ్ లో లేదు. కథ-కథనం సాదాసీదాగా ఉన్నాయి. కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ జోడీ కెమిస్ట్రీ అంతంత మాత్రమే. కొన్ని ఎమోషనల్ సీన్స్ మాత్రం బాగున్నాయి.

ఆదికి జోడీగా నటించిన శ్రద్దా శ్రీనాథ్ ఆకట్టుకొంది. ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించింది. ‘జెర్సీ’ తర్వాత ఆమె నటించిన తెలుగు సినిమా ఇది. ఈ నేపథ్యంలో ‘జోడీ’ సినిమా, అందులో శ్రద్దా పాత్రపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్దాయి. ఐతే, శ్రద్దా టాలెంట్ ని దర్శకుడు వాడుకోలేకపోయాడు. ఇక ఆది తన పాత్రకి న్యాయం చేశాడు. సినిమాని తన భుజాలపై మోసే రేంజ్ లో మాత్రం ఆయన నటన లేదు. వెన్నెల కిషోర్ కొన్ని నవ్వుపు పంచాడు. మిగితా తారగణం తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా :

జోడీ పాటలు సాదాసీదాగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఫస్టాఫ్ లో రొమాంటి, కామెడీ సీన్స్ తో సినిమా స్పీడుగా సాగినట్టు అనిపించింది. సెకాంఢాప్ లో మాత్రం సినిమా స్లోగా నడిచింది. బోరింగ్ సన్నివేశాలున్నాయి. కొన్ని సీన్స్ కి కత్తెర పెట్టొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బాటమ్ లైన్ : ‘జోడి’ కుదరలె.. !

రేటింగ్ : 2/5