రూ. 800కోట్లతో మణిరత్నం మల్టీస్టారర్

‘బాహుబలి’ స్పూర్తితో దక్షిణాదిన భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. దాదాపు రూ. 350కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ప్రభాస్ ‘సాహో’ థియేటర్స్ సందడి చేస్తోంది. నెలగ్యాప్ తోనే మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ రాబోతుంది. ఈ సినిమా కోసం దాదాపు 250కోట్లు ఖర్చుపెట్టారు. కేజీఎఫ్ సిరీస్ కి కూడా బాహుబలియే స్పూర్తి అని చెప్పాలి.

ఇక దక్షిణాది నుంచి మరో భారీ బడ్జెట్ చిత్రానికి రంగం సిద్ధమైంది. ఫెమస్ నవలారచయిత కల్కీ రాసిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ అనే హిస్టారికల్ నవల ఆధారంగా మణిరత్నం సినిమాను తెరక్కేక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం దాదాపు 800 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాలో మొత్తం 12 పాటలు ఉండబోతున్నాయట. వాటిని సరికొత్తగా ఉంటాయట. నేపథ్య సంగీతం కోసం సరికొత్త పంథాని అనుసరించబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్.రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ పరిశ్రమలకి చెందిన పలువురు నటీనటులు ఈ మల్టీస్టారర్ లో నటించబోతున్నారు. త్వరలోనే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.