పార్టీ మారేందుకు చంద్రబాబు అవకాశం ఇస్తున్నారా ?

ఏపీలో టీడీపీకి చావు దెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలో ఆ పార్టీ కేవలం 21 స్థానాలకే పరితమైంది. వైకాపా 151 జయకేతనం ఎగురవేసింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. తనదైన మార్క్ తో పాలన సాగిస్తున్నారు. ప్రజాభిమానాన్ని చూరగొట్టున్నారు. సీఎంగా జగన్ వందరోజులు పూర్తి చేసుకొన్న సందర్భంగా ప్రజలపై వరాల జల్లు కురిపించాడు.

మరోవైపు తెదేపా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తుమ్మితే పార్టీ వీడేలా ఉన్నారు. పార్టీ మారాలని ఫిక్సయిన తెదేపా నేతలకి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ మంచి అవకాశం ఇస్తున్నట్టు కనబడుతోంది. ఇటీవల అయ్యన్న పార్థుడు బర్త్ డే వేడుకల్లో పాల్గొనేందుకు లోకేష్ నర్సిపట్నం వెళ్లారు. ఆ సందర్భాన్ని చూసుకొని అయ్యన్న పాత్రుడు తమ్ముడు, నర్సీపట్నం టీడీపీ అధ్యక్షుడు సన్యాసిపాత్రుడు పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఈరోజు చంద్రబాబుకి ఇలాంటి అనుభవమే ఎదురైంది.

చంద్రబాబు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ కాకినాడలో ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు హాజరుకాలేదు. ఆయన వ్యక్తిగత కారణాల వలనే సమావేశానికి రాలేదని తెలుస్తోంది. ఆయన బీజేపీ లేదా వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారమ్. మొత్తానికి.. చంద్రబాబు, లోకేష్ పర్యటనలు తెదేపా నేతలు మార్టీ మారేందుకు దొరికిన ఓ వేదికగా మారినట్టు కనిపిస్తోంది.