తరుణ్ భాస్కర్ హీరోయిజం ఎలా ఉంది ?


రచయిత దర్శకుడిగా మారితే.. కలం బలం కనిపిస్తుంటుంది. మాటలు కోటలు దాటుతాయ్. కథ-కథనాలు బాగా కుదురుతాయని చెబుతుంటారు. మరీ.. దర్శకుడు హీరోగా మారితే ఎలా ఉంటుంది ? ‘మీకు మాత్రమే చెప్తా’ చూస్తే అర్థమవుతుంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా మారి చేసిన చిత్రమిది. కొత్త దర్శకుడు షమ్మీర్‌ సుల్తాన్‌ దర్శకత్వం వహించారు. విజయ్ దేవరకొండ నిర్మాత వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల అయింది. ఇందులో తరుణ్ భాస్కర్ నటనతో ఆకట్టుకొన్నాడు.

నటనలో తరుణ్ భాస్కర్ ఫుల్ మార్కులు పడతాయ్. ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకొన్నాడు. కాకపోతే.. ఆయన కాస్త లావుగా కనిపించారు. దానికి తగ్గట్టుగానే ఆయన ఫ్రెండ్స్ బ్యాచ్ ని సెట్ చేశారు. ఇక తరుణ్ భాస్కర్ నట విశ్వరూపం సినిమాలో చూడాల్సిందే. టీజర్ లో
‘మీ లాంటి వారు బ్రౌజర్‌ హిస్టరీ డిలిట్‌ చేస్తారు. కాల్‌ హిస్టరీ డిలిట్‌ చేస్తారు. వాట్సప్‌ చాట్‌ డిలిట్‌ చేస్తారు. అన్నీ దాచేసి దొరికిపోతే చీటింగ్‌ కాదంటారు’ అంటూ అనసూయ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.