జగన్ 100రోజులపై పాలనపై లోకేష్ కామెంట్

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వందరోజుల పాలనని పూర్తి చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజలపై వరాల జల్లు కురిపించారు సీఎం జగన్. ప్రజలకి ఇచ్చిన హామీలని నెరవేర్చేందుకు టైం టేబుల్ ప్రకటించారు. ఏ నెలలో ఏ పనులు చేయబోతున్నామో ముందుగానే చెప్పేశారు. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ వందరోజుల పాలన భేష్ అంటున్నారు.

ఇక జగన్ వందల రోజుల పాలన చాలా గొప్పగా సాగిందని వైకాపా నేతలు స్పీచులు దంచేస్తున్నారు. తెదేపాలోని కొందరు నేతలు కూడా జగన్ వందరోజుల పాలనపై సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. తెదేపా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సీఎం జగన్ పాలన గొప్పగా ఉందని కితాబిచ్చిన సంగతి తెలిసిందే. తెదేపా అధిష్టానం మాత్రం ఈ మాటలని అంగీకరించడం లేదు.

జగన్ ది రాక్షస పాలన అంటూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలు చేస్తున్నారు. గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కాస్త లేటుగా జగన్ వందరోజుల పాలనపై స్పందించారు. మైకు ముందటికి
రాకుండా.. ఎప్పటిలాగే ఓ ట్విట్టు వదిలాడు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధర్నా చౌక్ లు ఫుల్, అభివృద్ది నిల్… సంక్షేమం డల్”
ఉందని ఓ కొటేషన్ లాంటి కామెంట్స్ పెట్టారు. ఏం సాధించారని 100రోజలపై గొప్పలు అని ప్రశ్నించారు.