రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ రచ్చ


ఏపీ రాజధాని అమరావతి మార్పు ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చి రాజకీయ వేడిని రగిలించారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధానిగా అమరావతి అంత సేఫ్ కాదు. రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం ప్రకటిస్తామని కొద్దిరోజుల క్రిందట మంత్రి బొత్స వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఏపీ రాజధానిపై విస్తృత చర్చ జరుగుతోంది. అసలు ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందా ? లేదా ?? అనే గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజధానికి భూములిచ్చిన రైతులు. అప్పట్లో రాజధాని ప్రాంతంలో వందల ఎకరాలు కొనుకొన్న కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు రాజధానిపై జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. రాజధాని మార్పు ఉంటుందని తాము చెప్పలేదుగా అన్నట్టుగా సీఎం జగన్ సలైంట్ గా తన పని తాను చేసుకొంటున్నారు. ఐతే మంత్రి బొత్స మాత్రం రాజధాని అంశంపై రాజకీయ వేడిని చల్లార్చకుండా జాగ్రత్తపడుతున్నాడు. తాజాగా ఏపీ రాజధాని అమరావతేనని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారా ?అని గత
ప్రభుత్వాన్ని బొత్స ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అన్నిటినీ తాత్కాలికం అని పేరుపెట్టి కట్టారు. ఈ రాష్ట్రానికి చిరునామాలేకుండా
చేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో పర్మినెంట్ అన్నది లేకపోవడం వలనే పెట్టుబడిదారులు రాలేదని ఆరోపించారు.

మంత్రి బొత్స చేసిన అమరావతిపై గెజిట్ నోటిఫిషన్ పై మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత కౌంటర్ ఇచ్చారు. రాజధాని అమరావతేనని గత ప్రభుత్వం గెజిట్ ఇవ్వకపోతే అక్కడ సచివాలయంలో ఎందుకు కూర్చున్నారని, రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన విషయం వైసీపీ ప్రభుత్వానికి తెలియదా? రాజధాని భవనాలను పరిపాలనకు ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించారు. ఇదిలావుండగా.. 100 రోజుల వైసీపీ పాలన వైఫల్యాలపై ‘100 రోజులు 125 తప్పులు’ పేరుతో టీడీపీ బ్రోచర్ విడుదల చేసింది. ఏపీ భవిష్యత్ ప్లాన్ మొత్తం నాశనం చేశారని అందులో ఆరోపించారు.