మరోసారి బయటపడిన రామ్ బలహీనత !
ఎనర్జిట్ హీరో రామ్ కు ఓ బలహీనత ఉంది. ఆయన కష్టపడి ఓ హిట్ అందుకొంటారు. ఆ హిట్ తో వచ్చిన క్రేజ్ ని మాత్రం నిలుపుకోడు. ‘నేను శైలజ’ సినిమాకు ముందు రామ్ ని వరుసగా ప్లాపులు పలకరించాయి. రొటీన్ సినిమాలతో అభిమానులకి బోర్ కొట్టించాడు. ఐతే, ‘నేను శైలజ’ కోసం తనని తాను మార్చుకొన్నాడు. తన పంథాకి భిన్నంగా కనిపించాడు. తన ఎనర్జిని అంతా పక్కనపెట్టేసి సెటిల్డ్ గా నటించాడు. దానికి ఫలితం దక్కింది. ‘నేను శైలజ’ సూపర్ హిట్ అయింది. ఇక రామ్ మారాడు.
ఆయన నుంచి విభిన్నమైన సినిమాలు ఆశించవచ్చిన అనుకొన్నారు. కానీ, రామ్ తన తదుపరి సినిమాగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘హైపర్’ చేశాడు. అది పరమ రొటీన్. మళ్లీ తన ఎనర్జినీ అంతా చూపించాడు. రొటీన్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన హైపర్ ప్లాప్ అయింది. ఐతే, ఈ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ రామ్ ని ఆకర్షించి ఉంటుంది. ఇక, ‘ఇస్మార్ట్ శంకర్’ ముందు కూడా రామ్ ప్లాపుల్లో ఉన్నాడు. ఈ సినిమా కోసం రామ్ బాగా కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ చేశాడు. పూరి మార్క్ హీరోయిజంతో అదరగొట్టాడు. దానికి ఫలితం దక్కింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతకుమించి రామ్ ఫ్యాన్స్ కి విందు భోజనం పెట్టింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ మళ్లీ రొటీన్ దారిలోకి వెళ్లినట్టు సమాచారమ్.
రామ్ తనదుపరి సినిమా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఉండాల్సి ఉంది. కిషోర్ చెప్పిన కథని రామ్ ఓకే చేశాడు కూడా. కానీ ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత కథలో కొన్ని మార్పులు చేయమని, మాస్ టచ్ ఇవ్వమని కోరాడట. అది తన వల్ల కాదని చెప్పిన కిషోర్ రామ్ తో సినిమా క్యాన్సిల్ చేసుకొన్నట్టు టాక్. ఈ నేపథ్యంలో రామ్ మాస్ దర్శకుడు వివి వినాయక్ తో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారమ్. ఇందులో రామ్ డుయల్ రోల్ చేయబోతున్నాడట.
అసలే వినాయక్ ఫామ్ లో లేడు. ఆయనతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో వినాయక్ తో సినిమా అంటే రామ్ రిక్స్ చేస్తున్నట్టే అని అంటున్నారు. ఐతే, ఇస్మార్ట్ శంకర్ కి ముందు దర్శకుడు పూరి కూడా ప్లాపుల్లోనే ఉన్నాడుగా అంటున్నాడట రామ్. ప్లాప్ దర్శకులని హిట్ ఇచ్చే టార్గెట్ ఏదో పెట్టుకొన్నట్టున్నాడు రామ్. మరీ.. వినాయక్ కి రామ్ ఓ హిట్ ఇస్తాడేమో చూడాలి.