బిగ్ బాస్ 3 మరో లీకు : ఈ వారం అలీ అవుట్ 


కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 3 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. వందరోజుల షో యాభై రోజులు పూర్తికావొస్తోంది. ఈ సీజన్ నుంచి వారం రోజుల పాటు దూరంగా జరిగాడు నాగార్జున. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులందరితో కలిసి స్పెయిన్ వెళ్లాడు. ఈ వారం రీ ఎంట్రీ ఇచ్చాడు. శనివారం మళ్లీ బిగ్ బాస్ సెట్స్ పైకి వచ్చేశాడు. వస్తూనే సభ్యుల్లో కొందరికి క్లాస్ పీకాడు. నాగ్ రీఎంట్రీతో ఈసారి ఎలిమేషన్ పై మరోసారి అందరి దృష్టి పడింది. 

ఈ వారం హౌజ్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో రాహుల్, శ్రీముఖి, మహేష్, రవికృష్ణ, అలీ రెజాను ఉన్నారు. వీరిలో శనివారం రాహుల్ ని సేవ్ చేశారు నాగ్. ఇక మిగిలిన నలుగురిలో ఎవరు బయటకు వెళతారు ? అన్నది సోషల్ మీడియా ముందే కూసింది. ఎప్పటిలాగే.. ఓ రోజు ముందుగానే ఈ వారం అలీ రెజా బయటకు వెళ్లిపోతారని చెబుతుంది. ఇప్పటివరకు వచ్చిన లీకులన్నీ  నిజమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వారం అలీ అవుట్ ని ముందే తేలిపోయియినట్టయింది.