హైదరాబాద్ లో భారీ పేలుడు.. ఒకరి మృతి !

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో పేలుడు సంభవించింది. పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్‌వే 279 పిల్లర్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఫుట్‌పాత్‌ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఓ బాక్స్‌ను తెరుస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.పేలుడు ధాటికి ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనాస్థలికి పోలీసులు హుటాహుటిన చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 
దీని వెనక ఉగ్రదాడుల హస్తం ఏమైనా ఉందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి దాడులు, పేలుళ్లు జరగలేదు. శాంతి భద్రతల విషయంలో తెలంగాణకు మంచి పేరు దక్కింది. ప్రస్తుతం వినాయక నవత్రోత్సవాలు జరుగుతుండగా చోటు చేసుకొన్న ఈ పేలుడు ఘటనని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకోనుంది.