కేసీఆర్ కేబినేట్ : ఆ ఇద్దరు అవుట్.. ఈ ఇద్దరు ఇన్ !


ఈరోజు తెలంగాణ కేబినెస్ విస్తరణ ఉంది. సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటుచేశారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ సౌందర్ రాజన్ ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ వెంటనే సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రస్తుతం సీఎంతో కలిపి కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. 

కేబినెట్ లో మరో 6 ఖాళీలు అలానే ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారమ్ ప్రకారం తెలంగాణ కేబినెట్ లో హరీష్, కేటీఆర్ ఇద్దరికీ పదవులు దక్కే ఛాన్స్ ఉంది. వీళ్లతో పాటు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్ కు కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు మంత్రులు ఈటెల రాజేందర్, మల్లారెడ్డిలపై వేటు పడొచ్చని సమాచారమ్.

మల్లారెడ్డి పనితీరుపై సీఎం కేసీఆర్ సంతృప్తిగా లేరని తెలుస్తోంది. ఇక ఈటెల వ్యవహారం తెలిసిందే. ఆయన తామే గులాభి అసలు ఓనర్లమని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన తోడుగా రసమయి నోరు తెరిచారు. ఈసారి ఈటెలని నిజంగానే తప్పిస్తే తెరాసలో రెబల్ లిస్టు పెరగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఈటెల ని తప్పించే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేయకపోవచ్చని టాక్.