హరీష్ రావుకు ఆర్థికశాఖ
కొత్త మంత్రులకి శాఖలని కేటాయించారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ కొత్తగా ఆరుగురిని కేబినేట్ లోకి తీసుకొన్న సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే కొత్త మంత్రులతో కొత్త గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటికి వారికి శాఖలను కేటయించారు.
తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు గత ప్రభుత్వంలో ఉన్న ఐటీ, మున్సిపల్ శాఖలతో పాటు మైనింగ్, పరిశ్రమల శాఖలను అప్పగించారు. హరీశ్ రావుకు కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించగా, కేటీఆర్ కు ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖలు, సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ, పువ్వాడ అజయ్ కుమార్ కు రవాణాశాఖ, గంగుల కమలాకర్ కు బీసీ సంక్షేమశాఖ, సత్యవతి రాథోడ్ కు పౌరసరఫరాలు, సంక్షేమ శాఖలను కేటాయించారు.