మంత్రుల ప్రమాణం : ముందుగా హరీష్.. చివరగా పువ్వాడ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ఆరుగురిని తన మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కేటీఆర్ లకి మంత్రి పదవులు దక్కాయి. రాజ్ భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. రాజ్‌భవన్ లో ఆరుగురు మంత్రులతో  గవర్నర్ సౌందరరాజన్ ప్రమాణం చేయించారు.

ముందు హరీష్ రావు, ఆయన తర్వాత కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు. అంతకుముందు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ ఒకేకారులో రాజ్ భవన్ కు వచ్చారు. కొంతకాలంగా హరీష్ రావు, కెసిఆర్ కుటుంబాల మధ్య సఖ్యత కొరవడిందని ప్రచారం జరుగుతుండగా ఎప్పటికప్పుడు హరీష్-కేటీఆర్ ఆ ప్రచారానికి చెక్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు కూడా మరోసారి హరీష్-కేటీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు.