హరీష్ కు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్


బావకు బామ్మర్థి గుడ్ న్యూస్ చెప్పారా ? హరీష్ రావుకి కేటీఆర్ ఫోన్ చేశారు. ఇవాళ తెలంగాణ కేబినేట్ విస్తరణ ఉన్న నేపథ్యంలో హరీష్ కి కేటీఆర్ ఫోన్ చేయడం ప్రాధాన్యతని సంతరించుకొంది. తాజా కేబినెట్ విస్తరణలో కేటీఆర్ తో పాటు హరీష్ రావుకి మంత్రి పదవులు దక్కినట్టు సమాచారమ్. ఈ విషయం చెప్పడానికి కేటీఆర్ హరీష్ కి ఫోన్ చేసి ఉంటారని చెప్పుకొంటున్నారు. వీరితో పాటుగా సబితా, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ లకు చోటు దక్కునుందని చెబుతున్నారు.  

సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ సౌందర్ రాజన్ ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ వెంటనే సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రస్తుతం సీఎంతో కలిపి కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. తాజా కేబినేట్ విస్తరణలో మరో ఆరుగురికి స్థానం దక్కనుంది.