కేటీఆర్ అను నేను.. 


బావబామర్థులు హరీష్ రావు, కేటీఆర్ తిరిగి కేసీఆర్ కేబినేట్ లోకి అడుగుపెట్టారు. సీఎం కేసీఆర్ కేబినేట్ ని విస్తరించారు.కొత్తగా ఆరుగురిని తన మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కేటీఆర్ లకి మంత్రి పదవులు దక్కాయి. ఐతే, అందరి చూపులు మాత్రం హరీష్, కేటీఆర్ లపైనే ఉన్నాయి.

కేటీఆర్ కోసం హరీష్ ని తొక్కేస్తున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి చెక్ పెడుతూ.. హరీష్ ని తిరిగి కేబినేట్ లోకి తీసుకొన్నారు. అంతేకాదు.. ప్రమాణ స్వీకారోత్సవానికి హరీష్, కేటీఆర్ ఒకే కారులో కలిసి రాజ్ భవన్  కి రావడం విశేషం. ఇక, కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సభికుల నుంచి భారీ స్పందన వచ్చింది. చప్పలు, ఈలలు, కేకలతో హర్షం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కొత్త గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కాస్త ఆశ్చర్యంగా చూశారు.