పీవీ సింధుకి కాబోయే వాడు.. ఎలా ఉండాలంటే ?


రెండుసార్లు చేజారిన ప్రపంచకప్ ను పట్టుబట్టి మరీ.. చేజిక్కించుకున్న పీవీ సింధు. స్వర్ణం గెలిచిన తర్వాత మీడియాతో పిచ్చా పాటిగా మాట్లాడిన పీవీ సింధు ఆసక్తికర విషయాలు పంచుకొంది. సింధుకి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టమట. సమయం దొరికితే.. తనకిష్టమైన బీఎమ్ డబ్ల్యూ 320డి డ్రైవ్ చేస్తుందట. నాన్న, గురువు గోపీచంద్, సచిన్ ఆట అంటే ఇష్టం. సినిమాలు చూస్తాను. 

తెలుగు సినిమాలు బాగా చూస్తాను. సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇష్టం. సమయం దొరికితే థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తానని చెప్పుకొచ్చింది. ఆటలో బిజీగా ఉండి అక్కపెళ్లికి వెళ్లకపోవడం చాలా బాధని కలిగించింది. తనకి కాబోయే వాడు. నా కంటే హైట్ గా ఉండాలి. దానం చేసే గుణం కలిగి ఉండాలని తెలిపింది. ఇక హైదారాబాద్ దమ్ కా బిర్యానీ విత్ మటన్ కీమ, చేపల పులుసు, పెరుగు అంటే చాలా ఇష్టంని తెలిపింది పీవీ సింధు.