‘సాహో’ ప్లాప్ ‘సైరా’కు ధైర్యం తెచ్చిందా ?


నాన్ బాహుబలి పదాన్ని తుడిపేస్తుందని భావించిన ‘సాహో’ తీవ్రంగా నిరాశపరిచింది. ఐతే, టాక్ తో సంబంధం లేకుండా తొలివారమే రూ. 370కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. ఇప్పుడిదే ‘సైరా’కు ధైర్యం ఇచ్చినట్టు కనబడుతోంది. ‘బాహుబలి’ సినిమాకు ‘సైరా’ కు అసలు సంబంధం లేదని ‘బాహుబలి’ ఒక కాల్పనిక కథ అయితే ‘సైరా’ ఒక యదార్ధ చరిత్ర అంటూ దర్శకుడు సురేందర్ రెడ్ది కామెంట్స్ చేశాడు. అంతేకాదు తాను ‘సాహో’ రిజల్ట్ తరువాత ‘సైరా విడుదల అవుతున్నందుకు తానేమి భయపడటం లేదన్నారు.

డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘సాహో’ కు 370 కలక్షన్స్ వస్తే.. తనకు సైరా విజయం పై ఏమాత్రం సందేహం లేదు. ‘సైరా’ కు ఎన్ని కోట్ల కలక్షన్స్ వస్తాయో తనకి ఊహకు అందని విషయంగా మారింది సురేందర్ రెడ్డి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ లతో కలిసి రషెస్ చూశాను. రషెస్ చూసిన తర్వాత మెగాస్టార్ తనని గుండెలకి హత్తుకొన్నాడని చెప్పుకొచ్చాడు. షూటింగ్ లో పలుమార్లు ఈ చిత్రం నాన్నకి పెద్దగా గిఫ్ట్ గా ఇవ్వాలన్న మాటలు గుర్తుకు వస్తున్నాయన్నారు. మొత్తానికి సాహో ప్లాప్ సైరా చిత్రబృందానికి ధైర్యం పెంచినట్టు కనబడుతోంది.