తమిళిసై సౌందరరాజన్ అను నేను..
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ తమిళిసై సౌందరరాజన్ చేత ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి డిప్యూటి ఛైర్మన్ నేతి విద్యాసాగర్, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్ గవర్నర్‌కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, తమిళనాడు మంత్రులు వేలుమణి, తంగమణి తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం తన తండ్రికి గవర్నర్ తమిళిసై పాదాభివందనం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేష్, తెలుగు రాష్ట్రల ఉమ్మడి గవర్నర్ గా నరసింహాన్ సుదీర్ఘకాలం పాటు గవర్నర్ గా సేవలందించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో తమిళిసై సౌందరరాజన్ ని కేంద్రం నియమించింది.