‘గద్దలకొండ గణేష్’గా వరుణ్ తేజ్ !


మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ మెతక అనుకొన్నారు. మెగా హీరోలకి భిన్నంగా మొదట్లో మాస్ కు ట్రై చేయలేదు. ‘ముకుందా’ సినిమాతో కూల్ గా ఎంట్రీ ఇచ్చారు. కంచె, ఫిదా, తొలిప్రేమ.. తనకి సూటయ్యే సినిమాలు చేశారు. మధ్యలో ‘లోఫర్’ సినిమాతో మాస్ ని టచ్ చేసిన వర్కవుట్ కాలేదు. ఇక, ‘ఎఫ్ 2’తో తెలంగాణ పోరగాడుగా అదరగొట్టేశాడు. వెంకీతో కలిసి నవ్వులు పంచారు. 

మెల్లమెల్లగా మాస్ డోస్ పెంచుకొంటూ వెళ్తున్న వరుణ్ తేజ్ వాల్మీకి తో ప్రేక్షకుల కి షాక్ ఇచ్చాడు. నాటు లుక్ లోకి మారిపోయాడు. గెడ్డెం పెంచేసి భయంకరమైన లుక్ లోకి మారిపోయాడు. ఇందులో వరుణ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే పాత్రలో వరుణ్ గద్దలకొండ గణేష్ గా కనిపించబోతున్నారు. తాజాగా దానికి సంబంధించిన లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఎనభైల్లో ఉన్న బెల్ బాటమ్ ప్యాంట్ తో అప్పటి ఫ్యాషన్స్ ను అనుసరిస్తూ సెకండాఫ్ లో ఓ ప్లాఫ్ బ్యాక్ రానుంది. దానికి సంబంధించిన లుక్ ఇదని చెబుతున్నారు.

ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు తెలుగు రీమేక్‌ ఇది. కోలీవుడ్ కుర్ర హీరో అథర్వ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నాడు. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 20న వాల్మీకి ప్రేక్షకుల ముందుకు రానుంది.