పవన్ కోసం హీరోయిన్ రాసుకొన్న ప్రేమ లేఖ చూశారా ?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోలందరికీ అభిమానులుంటారు. పవన్ కి మాత్రం భక్తులుంటారు. ఇందులో లేడీ భక్తులు కూడా ఉన్నారు. చాలామంది హీరోయిన్స్ పవన్ కి పెద్ద ఫ్యాన్స్. ఇందులో హీరోయిన్, ప్రస్తుత బీజేపీ మహిళా నాయకురాలు మాధవీలత కూడా ఉన్నారు. ఆమె స్కూల్ లో ఉన్నప్పుడు దాదాపు 19యేళ్ల క్రితం పవన్ కోసం ఓ లేఖని రాసుకొందట. అది దాదాపు ప్రేమలేఖ టైపు. ఇటీవల ఆ ప్రేమలేఖ దొరికిందని.. దాన్ని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది మాధవీలత. అందులో పవన్ పై మాధవీలత చూపించిన అభిమానం, ప్రేమ గొప్పగా ఉంది. ఆ లేఖని మీరు చదివేయండీ.. !
‘మనసులో ఏదో వేదనకారణం తెలియక పడుతున్నా తపన
హృదయంలో అనురాగం అనే భావన
దానికో రూపం ఇచ్చేందుకే ఈ సాధన
నీవు కనిపించగానే నా హృదయంలో ఏదో బాధ
నా మనస్సుని ఎవరో గట్టిగా పట్టేసినట్టుగా వేదన
ఒకపక్క సంతోషం, మరోపక్క దుఃఖం కానీ,…. కానీ ఎందుకో తెలీదు
నిను చూస్తున్న ప్రతీక్షణం నేను కారణం చెప్పలేని భావాలలో విలవిల్లాడిపోతాను. దానికి అర్థం ఏంటి? నేను ఎందుకిలా అవుతున్నాను?
ఇది ఆకర్షణా? ప్రేమ అనే వ్యామోహమా?
No. కానే కాదు. అటువంటిది కాదు. మరేంటి?…..’
అంటూ తన మనసులోని భావాలను పవన్ కళ్యాన్ కోసం స్కూల్లో ఉన్నప్పుడే ఓ నోట్స్ రాసి దాచుకుంది ఈ తెలుగు హీరోయిన్.