బిగ్ బాస్ 3 : ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో.. ఆ ఐదుగురు !

బిగ్ బాస్ 3 విజయవంతంగా యాభైరోజులు పూర్తి చేసుకొంది. ఏడోవారం అలీరెజా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఐతే, అలీ ఎలిమినేషన్ ని హౌస్ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. శివజ్యోతి, రవి, శ్రీముఖీ, బాబా భాస్కర్ బాగా బాధపడుతూ కనిపించారు. అలీని మళ్లీ హౌస్  లోకి పంపించాలని శివజ్యోతి బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసింది. ఇక సోమవారం జరిగిన ఎలిమినేషన్ భాగంగా హౌస్‌లో ఉన్న పదకొండు మందిని రెండు గ్రూపులుగా విడగొట్టారు. కెప్టెన్ బాబా భాస్కర్ కి ఎలిమినేషన్ నుండి మినహాయింపు దక్కింది.

గ్రూప్-1లో రాహుల్, వరుణ్, వితికా, శిల్ప, పునర్నవిలు ఉండగా, గ్రూప్‌ 2లో రవి, శివజ్యోతి, శ్రీముఖి, మహేష్, హిమజలు ఉన్నారు. ఒక్కో గ్రూప్‌ వాళ్లు.. తమ ఆపోజిట్ గ్రూప్‌లో ఉన్న ఇద్దరి ఫొటోలను తీసుకుని మంటల్లో కాల్చి నామినేట్ చేయడానికి సరైన కారణం చెప్పాలని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, రవి, శ్రీముఖిలను ఎక్కువ మంది నామినేట్ చేశారు. ఐతే, వీరిలో ఒక్కరిని సేవ్ చేసే అవకాశాన్ని బిగ్ బాస్ కెప్టెన్ బాబా భాస్కర్ కి ఇచ్చారు. ఆయన రవిని సేవ్ చేశారు. దీంతో.. ఈవారం ఎలిమినేషన్ లిస్టులో మొత్తం ఐదుగురు   శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, శ్రీముఖీ ఉన్నారు.